Thamanah: 'బాక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఎక్కడంటే..!

  • సుందర్ సి దర్శకుడిగా రూపొందిన 'బాక్'
  • హారర్ కామెడీ నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • ప్రధానమైన పాత్రలను పోషించిన తమన్నా - రాశి ఖన్నా 
  • మే 3వ తేదీన సినిమా విడుదల

Baak Movie Update

తమిళంలో హారర్ కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో సుందర్ సి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు. లారెన్స్ 'కాంచన' సిరీస్ ను చేసుకుంటూ వస్తున్నట్టు, సుందర్ సి. 'అరణ్మనై' సిరీస్ చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఈ సిరీస్ లో గతంలో రూపొందిన సినిమాలలో చంద్రకళ' .. 'కళావతి' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అరణ్మణై 3 మాత్రం తెలుగు ఆడియన్స్ కి   అంతగా కనెక్ట్ కాలేదు. 

ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి ఇప్పుడు 4వ భాగం వస్తోంది. తమన్నా - రాశిఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి 'బాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కావలసింది. కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు. మే 3వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి కూడా ముహూర్తాన్ని ఖాయం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు రామానాయుడు స్టూడియోస్ గార్డెన్ లో ఈ వేడుక మొదలుకానుంది.

ఇప్పటివరకూ వచ్చిన 'అరణ్మనై' సిరీస్ లలో దెయ్యం అనేది ఒక బంగ్లాకు పరిమితమైంది. కానీ 'బాక్'లో మాత్రం దెయ్యం అడవిలో తిరుగుతూ భయపెడుతుందని అంటున్నారు. బ్రహ్మపుత్ర నదికి ఆవలి తీరంలో తిరుగుతూ, ఎవరినీ అటువైపు కూడా రానీయని ఆ దెయ్యం .. ఇటు వైవు వస్తే అనేదే ఈ సినిమా కథ. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. 

More Telugu News